![]() |
![]() |

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అటు కొరియోగ్రాఫర్ గా ఇటు జనసేనలో కార్యకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ పనిచేశారు. టాప్ స్టార్స్ అందరితో కలిసి ఆయన పనిచేశారు. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా పనిచేశారు జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ రీసెంట్ గా ప్రమాదం బారిన పడిన ఇద్దరిని కాపాడారు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "నిన్న జనసేన అధినేతని కలిసి తిరిగి వెళుతుండగా విజయవాడ బెంజ్ సర్కిల్ కరకట్ట దగ్గర వేరు వేరు ప్రమాదాలు జరిగాయి.
గాయాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా అక్కడున్న వారు, ఆఖరికి పోలీసు అధికారులు కూడా అంబులెన్సు కోసం ఎదురుచూస్తూ ఉండడం గమనించా. వెంటనే స్పందించి వారికి ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి వైద్యం కోసం తరలించాం. ఆపద సమయంలో సాయం అందించడం కూడా దైవ కార్యమే కదా!!" అంటూ తాను చేసిన పని గురించి అక్కడ అసలేం జరిగిందో వివరంగా పెట్టారు. ఇక ఆయన చేసిన మంచి పనికి నెటిజన్స్ ఫిదా ఇపోయారు. "మంచి పని చేశావన్న...ఏం అడిగిన కాదు అనకుండా విసుగు లేకుండా అడగగానే ఫోటో కూడా ఇస్తారు మీరు .. మీలాంటి వాళ్లకి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు అన్న. ఆ నొప్పి తెలిసినోడు, ఆ స్థాయి నుండి వెళ్లినోడికే తెలుసు సాయం చేయడం ..మీది చాలా మంచి మనసు. సెల్యూట్ మాస్టర్, సూపర్ బ్రో, లవ్ యు అన్న, మీరు ఆల్రెడీ డాన్స్ లో సక్సెస్ అయ్యారు. మా తరం వారికి మీరు మంచి ఇన్స్పిరేషన్ గా మారారు. జనసేనలో మీలాంటి వాళ్ళు ఉన్నందుకు నిజంగా గొప్ప విషయం. అసలైన జనసైనికుడు అంటే ఇలా ఉంటారు..జానీ మాస్టర్ మీరు గ్రేట్. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |